15 April, 2026 | 1:55 PM

Breaking News

పేకాట ఆడుతున్నారనే నెపంతో ఎస్ఐ దాడి... పోలీస్ స్టేషన్ ఎదుట 100 మంది ధర్నా   •   ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •  

ఎస్‌ఈసీ, సీపీలకు బీఆర్‌ఎస్ నేతల ఫిర్యాదు

08-02-2026 12:00 AM

మేడ్చల్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని లాల్ గడి మలక్ పేటలో జరిగిన ఘటనపై బి ఆర్ ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్‌రెడ్డికి వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. తాము ఇంట్లో సమావేశం కాగా కావాలని కాంగ్రెస్ ప్రచార రథానికి సౌండ్ ఎక్కువగా పెట్టి అసౌకర్యం కల్పించారని, అంతేగాక తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

తమ పార్టీకి చెందిన ఢిల్లీ పరమేష్, శివ కుమారులకు గాయాలయ్యాయని తెలిపారు. భౌతి కంగా దాడి చేయడమే గాక రాళ్ల తో కూడా దాడి చేశారని తెలిపారు. ఏసిపి, సీఐ, ఎస్సై లు, ఇతర సిబ్బంది ఉండగానే దాడి జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారమే వచ్చి దాడికి పాల్పడ్డారని, కాంగ్రె స్ నాయకులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని వారు వివరించారు.

అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజా స్వామ్య యూత్‌ంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలిపారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఫిర్యా దు చేసిన వారిలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, సుంకరి రాజు ఉన్నారు.