28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

టూ వీలర్స్ మెకానిక్‌లకు అండగా ఉంటా

08-02-2026 12:00 AM

ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

కుషాయిగూడ ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): వీలర్ మెకానికులకు అండగా ఉంటానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హెచ్‌ఎంఆర్ మూడవ వార్షికోత్సవ వేడుకలను శనివారం చర్లపల్లి సిఐఏ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమంతో పాటుగా సామాజిక స్పృహ తో పని చేస్తానన్నారు. ఆపదలో ఉన్న వారికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు.

టు వీలర్ మెకానిక్ లకు సంబంధించి ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతానన్నారు. హెచ్‌ఎంఆర్ భవన నిర్మాణానికి కావలసిన స్థలాన్ని కేటాయించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. అలాగే ట్రాఫిక్ పోలీసులతో ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ఉన్నతాధికా రులతో మాట్లాడి ఇబ్బందులు లేకుండా చూస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఆర్ అధ్యక్షుడు జి.అశోక్ కుమార్, ఉపాధ్యక్షుడు ఎం.జగన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ఏ.నరేందర్ యాద వ్, కోశాధికారి యం. మైపాల్ రెడ్డి, ఉప కార్యదర్శి డి.శ్రీనివాస్, మహేందర్ చారి తదితరులు పాల్గొన్నారు.