24 April, 2026 | 9:30 PM

బీఆర్ఎస్ నాయకులకు రైతుల పక్షాన మాట్లాడే అర్హత లేదు

24-04-2026 08:17 PM

రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు

ఖమ్మం,(విజయక్రాంతి): రైతుల పక్షాన మాట్లాడే తర్వాత బిఆర్ఎస్ నాయకులకు లేనేలేదని రైతుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వమేనని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పత్రిక సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ నాయకులు రైతుల పక్షాన ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మీకు రైతుల పక్షాన మాట్లాడే అర్హత లేదన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో పండనంతా విధంగా గత సంవత్సరం,ఈ సంవత్సరం వరి, మొక్కజొన్న పండడం హర్షనీయమన్నారు..రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు.. దానికి తక్కట్టుగానే ప్రభుత్వం అన్ని విధాలుగా రైతు పండించిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి కోనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు కోనుగోలు చేస్తామన్నారు. వీరు మోసలి కన్నీరు కారుస్తూ, సానుభూతిని తెలియజేయనవసరం లేదని హెచ్చరించారు. రైతులు అంత యార్డ్ లలో బస్తా లను కాటాలు వేసుకునే పనుల్లో ఉన్నారు.

రైతులకు అవసరం ఉన్న చోట కోనుగోలు కేంద్రాలను తెరిచి, ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది అని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఎంత కష్టమైన, నష్టమైనా భారించడానికి సిద్ధంగా ఉన్నామని ఈ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పోంగులేటి శ్రీనివాసరెడ్డి సృష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే మూఫై కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంకా అవసరమైతే ఏర్పాటు చేస్తామన్నారు. ఇప్పటికే 50వేల మెట్రిక్ టన్నులు కోనుగోలు కేంద్రాల ద్వారా కోనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.