28 June, 2026 | 3:48 PM

Breaking News

పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఉపసర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: సర్పంచ్ గండి నారాయణ   •   గుండ్రాంపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •  

మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ నాయకులు

05-02-2026 12:00 AM

మంథని, ఫిబ్రవరి 4(విజయక్రాంతి): మంథని మున్సిపాలిటీ సంబంధించిన వివిధ వాడలకు  చెందిన బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు  రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  కాంగ్రెస్ పార్టీ లో చేరిన వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించి మంథని పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదల వెంకన్న,  కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.