calender_icon.png 2 November, 2025 | 8:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడులు చేయడం హేయమైన చర్య

02-11-2025 02:45:07 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ కాల్చివేసి, పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు కరెక్ట్ కాదని మండిపడ్డారు. ఆదివారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ... మణుగూరు మండల పార్టీ కార్యాలయానికి సంబంధించిన ఇంటి పన్ను అన్ని పత్రాలు రేగా కాంతారావు పేరు మీద ఉన్నాయని, చట్ట ప్రకారం అన్ని అనుమతులు ఆయనకు ఉన్నప్పటికీ చట్టాన్ని అతిక్రమించి దాడి చేసి పార్టీ కార్యాలయాన్ని స్వాధీనపరచుకోవడం కాంగ్రెస్ పార్టీ నైజానికి నిదర్శమన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మణుగూరు మండలానికి సంబంధించిన పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎవరూ లేని సమయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దౌర్జన్యం చేసి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు.