19 August, 2026 | 7:26 PM

ప్రజా పాలన కాదు.. అరాచక పాలన

19-08-2026 05:56 PM

ముస్తాబాద్ బిఆర్ఎస్ నాయకుల ఫైర్

ముస్తాబాద్,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు సురేందర్ రావు మాజీ రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు హౌస్ అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ నాయకులతో కలిసి ఈ సందర్బంగా మాట్లాడారు. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)హాస్పిటల్ ను సందర్శించడానికి హరీష్ రావు పిలుపునిస్తే కోకాపేటలోని తమ నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడాన్ని ముస్తాబాద్ మండలం భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

అలాగే నర్సంపేటలో అర్ధరాత్రి పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం పట్ల ప్రభుత్వం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజావ్యతిరేకత విధానాలతో ప్రజా పాలన కొనసాగుతుందని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఖరిని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎండ కడతారని ఇది ప్రజా పాలన కాదని అరాచక పాలనని బుధవారం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, ముస్తాబాద్ మాజీ పట్టణ అధ్యక్షుడు సంతోష్ రావు, నాయకులు మనోహర్, జహంగీర్, కోడె శ్రీనివాస్ మండల యూత్ అధ్యక్షుడు స్వామి, శివకేశవ ఆలయ చైర్మన్ శేరయ్య, యాదగిరి, సత్యంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.