19 August, 2026 | 6:40 PM

బాల్యం నుండే యోగాలో శిక్షణ పొందాలి

19-08-2026 05:59 PM

ఎమ్మెల్యే గంగుల 

ముకరంపుర,(విజయక్రాంతి): యోగాకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో మన కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలో విజేతలుగా నిలవాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో బుధవారం జిల్లాస్థాయి యోగా పోటీలు జరిగాయి. ఈ సందర్భంగా హాజరైన ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ చిన్న వయసు నుండి యోగాలో శిక్షణ పొందితే విస్తృత ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు.

విద్యార్థులు అందరూ బాల్యం నుండే యోగాలో ప్రవేశం పొందాలన్నారు. కరీంనగర్లో జరిగే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల విజయవంతంగా నిర్వహించుటకు తాను పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర యోగ అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, తెలంగాణ యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి  లు మాట్లాడుతూ...  యోగాలో కరీంనగర్ జిల్లా ది ప్రత్యేక స్థానమని ఇక్కడి నుండి సిద్ధారెడ్డి, ప్రణీత, యమున లు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనున్న ప్రతిష్టాత్మక  ఖేలో ఇండియా  జాతీయ యోగ పోటీలు కరీంనగర్లో నిర్వహించేలా ఎమ్మెల్యే గంగుల చొరవ తీసుకోవాలని కోరారు. క్రీడాకారులు ప్రదర్శించిన యోగ విన్యాసాలు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డి వై ఎస్ ఓ వి శ్రీనివాస్ ఆర్ఎస్ఎస్ ప్రిన్సిపాల్ కే శ్రీనివాస్ , మాజీ కార్పొరేటర్లు చల్లా హరి శంకర్, ఎడ్ల అశోక్, జిల్లా యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గుంటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.