19 August, 2026 | 6:40 PM

అర్హులైన ప్రతి ఒక్కరికి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

19-08-2026 05:52 PM

బోథ్,(విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ ప్రభుత్వపరంగా స్మార్ట్ డిజిటల్ రేషన్ కార్డులను అందించడం జరుగుతుందని పార్టీ గ్రామ సర్పంచ్ చౌహన్ వినోద్ సింగ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులందరికీ కార్డులను పంపిణీ చేయించడం జరుగుతుందన్నారు. అర్హులైన కుటుంబాల వారికి సంక్షేమ పథకాలు అందించాలన్న దృక్పథంతో ఉన్నారన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అశోక్ రేషన్ డీలర్ ప్రేమ్ సింగ్ మాజీ సర్పంచ్ పార్వతి బాయ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు