01-02-2026 05:35:12 PM
వాంకిడి,(విజయక్రాంతి): ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షతో తప్పుడు కేసులు బనాయించి, సీట్లు సాధించుకోవడం, కేసీఆర్‌ను విచారణకు పిలవడం ప్రభుత్వ పాలనా వైఫల్యాలకు నిదర్శనమని బీఆర్ఎస్ వాంకిడి మండల అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ అజయ్ కుమార్ ఆరోపించారు. ఆదివారం వాంకిడి మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద తెలంగాణ జాతి పిత, కోట్లాది మంది ప్రజల ఆరాధ్యుడైన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ప్రభు త్వం సాగిస్తున్న కుత్రలకు నిరసనగా నల్ల జెండాలతో రోడ్డుపై కూర్చుని రాస్తారోకో చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... అజయ్ కుమార్, ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో ప్రతిపక్షాన్ని భయపెట్టే ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువలకు అవమానమని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ పై సీట్ పేరిట అధికారుల దర్యాప్తు ప్రభుత్వ దివాలియ తనికి నిదర్శనమని, కేసీఆర్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్- బీజే పీ తోడుదొంగల్లా ఒక్కటై పనికి మాలిన చెత్త ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. లేని కేసులను సృష్టించి ఎన్ని కల సమయంలో సీట్లు సాధిం చుకోవడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తోందని ఆయన విమర్శించారు.
కేసీఆర్ పాలిత్వంలో తెలంగా ణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినప్పటికీ, రేవంత్ సర్కార్ రెండేళ్లలో దాన్ని సర్వనాశనం చేసిందని అజయ్ కుమార్ మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమంలో వాంకిడి మాజీ సర్పంచ్ బండే తుకారాం , మాజీ సింగల్ విండో చైర్మన్ జాబోరే పెంటు, మాజీ వైస్ ఎంపీపీ రాజ్ కుమార్ మాజీ ఎంపీటీసీ ప్రవీణ్ సరండి సర్పంచ్ బాపూజీ బిఆర్ఎస్వి ఓయూ నాయకులు రాజ్ కుమార్ మండల యూత్ అధ్యక్షుడు ఎంగిలి రాకేష్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వార్లు రామచందర్ వెంకట్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.