calender_icon.png 25 May, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పాలనలో 'జల దోపిడీ' మళ్లీ మొదలు

25-05-2025 02:33:49 PM

జలదోపిడి జరుగుతుంటే.. కళ్లు అప్పగించి చూస్తోంది

హైదరాబాద్: సమైక్య ఆంధ్రలో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణకు తీవ్రనష్టం జరిగిందని బీఆర్ఎస్ సినీయర్ నేత తన్నీరు హరీశ్ రావు(BRS Senior Leader Harish Rao) తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ వల్ల తీవ్రనష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  సాగునీటి అవసరాలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల రూపంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన జలదోపిడి.. కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు(Congress leaders) పదవుల కోసం పెదవులు మూసుకున్నారు. రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంటే.. ప్రభుత్వం కళ్లు అప్పగించి చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్(Godavari-Banakacherla Project) వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లిందని హరీశ్ రావు సూచించారు. 200 టీఎంసీల గోదావరి జలాలు తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని చెప్పారు. సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేందని మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులు కడితే ఎందుకు మోకాలు అడ్డుపెట్టారని హరీశ్ రావు(Harish Rao) ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రద్దు చేయాలని కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దని కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారని ప్రశ్నించారు.

కాళేశ్వరానికి అన్ని అనుమతులు వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం(Telugu Desam Party) కేంద్రానికి లేఖ రాసింది. కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదు. ప్రాణహితకు కొనసాగింపేనని కేంద్రం అనుమతులు ఇచ్చిందని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వవద్దని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని హరీశ్ రావు గుర్తుచేశారు. డిండి ఎత్తిపోతలకు అనుమతులు ఇవ్వొద్దు.. ఇది కొత్త ప్రాజెక్టని లేఖలు రాశారని చెప్పారు. తెలంగాణ ప్రాజెక్టులు నిలిపివేయాలని 20కి పైగా లేఖలను ఏపీ ప్రభుత్వం కేంద్రానికి రాసిందని హరీశ్ రావు తేల్చిచెప్పారు. గోదావరి-బనకచర్ల కొత్త ప్రాజెక్ట్ కాదా? అని ఆయన ప్రశ్నించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎందుకు నిద్రపోతుందని ఫైర్ అయ్యారు. విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టులు నిర్మించాలంటే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అనుమతులు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలని తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ లో అనుమతులు తీసుకోవాలి, సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్, ఎన్విరాన్ మెంట్ అనుమతులు తీసుకోవాలని సూచించారు.

కేంద్రం జుట్టు తన చేతిలో ఉందని చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. గోదావరి-బనకచర్లకు ఒక్క అనుమతి లేకుండానే ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. రాత్రికి రాత్రి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి టెండర్లు పిలిచి ముందుకెళ్తున్నారని ఆయన వెల్లడించారు. పాలమూరు, భక్తరామదాసు, డిండి వద్దంటూ చంద్రబాబు కేంద్రం, గ్రీన్ ట్రైబ్యునల్ సీడబ్ల్యూసీ(Green Tribunal CWC)కి లేఖలు రాశారని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డంపెట్టే ప్రయత్నం చేశారని తెలిపారు. పాలమూరు, కాళేశ్వరం పాత ప్రాజెక్టులే.. ఉమ్మడి ఏపీలో ప్రారంభించినవేనన్న హరీశ్ రావు గోదావరి-బనకచర్ల కొత్త ప్రాజెక్టు, నిబంధనలు ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Govt) నిర్మిస్తోందన్నారు. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా పెట్టారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రానికి ఏమీ ఇవ్వడం లేదని.. నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరిస్తున్నట్లు సీఎం చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టిన మూసీ సుందరీకరణకు డిఫెన్స్ భూమి ఇవ్వలేదన్నారు. మూసీ సుందరీకరణ కోసం ప్రపంచబ్యాంక్(World Bank) అప్పుకోసం పంపిన ఫైల్ ను వెనక్కి పంపించారని హరీశ్ రావు సూచించారు.