సాంస్కృతిక విభాగం కన్వీనర్‌గా షర్ఫుద్దీన్
11-03-2026 07:36 PM
భైంసా,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ కారుల సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్‌గా నిర్మల్ కు చెందిన ఉద్యమకారుడు మమ్మద్ షర్ఫుద్దీన్ నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ఉద్యమంలో అనేక ఆందోళనలు చేపట్టారు. తెలంగాణ షరీఫ్ గా పేరు తెచ్చుకున్న ఆయన సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్‌గా ఎన్నికయ్యారు. బుధవారం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ ఈయనను జిల్లా కన్వీనర్‌గా నియమించారు. జిల్లా కన్వీనర్‌గా ఎన్నికైన ఈయనకు తెలంగాణ ఉద్యమకారులు రామకృష్ణ గౌడ్ శేఖర్ డాక్టర్ కృష్ణంరాజు ప్రత్యేక అభినందనలు తెలిపారు.




