25-05-2025 01:46:13 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మారుమూల గ్రామానికి చెందిన విద్యార్థిని కష్టపడి చదువుకొని డెంటల్ సర్జన్(Dental surgeon)గా పట్టా పొందిన డాక్టర్ మాధవ పెద్ది రితిక రెడ్డిని మహబూబాబాద్ జిల్లా పెనుగొండ గ్రామస్తులు అభినందనలతో ముంచెత్తారు. కేసముద్రం మార్కెట్ మాజీ చైర్మన్ శశివర్ధన్ రెడ్డి ఏకైక కుమార్తె చిన్నతనం నుంచి డాక్టర్ గా వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో, పట్టుదలతో చదివి మల్లారెడ్డి వైద్య కళాశాలలో(Mallareddy Medical College) డెంటల్ సర్జన్ గా ఇటీవల చదువు పూర్తి చేశారు. కళాశాలలో జరిగిన స్నాతకోత్సవంలో ఆర్టీసీ వీసీ సజ్జనార్(RTC VC Sajjanar) చేతుల మీదుగా వైద్య విద్య పూర్తి చేసిన సందర్భంగా పట్టా అందుకున్నారు. తమ గ్రామానికి చెందిన రితిక రెడ్డి డెంటల్ సర్జన్ వృత్తి చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.