11 March, 2026 | 11:10 PM

విద్యార్థుల భోజన నాణ్యతపై సర్పంచ్ పరిశీలన

11-03-2026 07:26 PM

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామపంచాయతీ సర్పంచ్ బెండరే కృష్ణాజీ బుధవారం స్థానిక ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి నాణ్యతపై ఆరా తీశారు. భోజనం శుభ్రంగా, పోషకాహారంతో ఉండేలా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.

అలాగే పాఠశాలలో విద్యార్థుల చదువు, వసతి సదుపాయాలపై కూడా సమీక్ష నిర్వహించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు. పాఠశాలలో అవసరమైన సదుపాయాలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.