ఆశ్రమ బాలికల పాఠశాలను తనిఖీ చేసిన సీడీపీఓ
11-03-2026 07:19 PM
బూర్గంపాడు,మార్చి11,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం బూర్గంపాడు ప్రాజెక్ట్ సీడీపీఓ కే.రేవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో ముఖాముఖి అయ్యారు. వారి చదువుల కోసం ఆరా తీశారు. అనంతరం నిత్యవసర సరుకులు, కూరగాయలను, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




