నీట్ అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ
23-06-2024 03:40 PM
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నీట్ యూజీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను ఎన్టీఏ వాయిదా వేసింది. కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర వైద్యశాఖ వెల్లడించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా నీట్ నిర్వహణలో అవకతవకలపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నీట్ పేపర్ లీక్ ఆరోపణలపై దర్యాప్తు చేయాలని కేంద్రం సీబీఐని ఆదేశించింది. ఇప్పటికే కేంద్ర వైద్యశాఖ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోద్ కుమార్ ను శనివారం రాత్రి విధుల్లో నుంచి తొలగించింది.






