28 August, 2026 | 1:16 PM

మంత్రి పొన్నంతో ఎక్కడైనా చర్చకు సిద్ధం: కౌశిక్ రెడ్డి

11-06-2024 12:26 PM

హైదరాబాద్: ఫ్లైయాష్‌ రవాణాలో నిబంధనలు ఉల్లంఘించి పెద్దఎత్తున స్కామ్ జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. రోజుకు 50 లక్షలు రూపాయాలతో మంత్రి జేబు నింపుతున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. పొన్నం ప్రభాకర్ కుమారుడు అనూప్ ద్వారా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎమ్మెల్యేగా తాను స్వయంగా లారీలను పట్టుకున్నానని చెప్పారు. రెండింటిని మాత్రమే సీజ్ చేసి మిగితా వాటిని వదిపెట్టారని ధ్వజమెత్తారు.

రవాణాశాఖ మంత్రి ఫోన్ తో అధికారులు లారీలను వదిలిపెట్టారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఆపుతున్నారని లారీలను వేరే మార్గంలో తీసుకెళ్తున్నారని చెప్పారు. అధికారులు స్పందించకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకుంటారని హెచ్చరించారు. ఫ్లైయాష్ విషయంలో మంత్రి పొన్నంతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని కౌషిక్ రెడ్డి సవాల్ విసిరారు,. ఓవర్ లోడ్ తో ఫ్లైయాష్ లారీలు పోతుంటే ఎన్టీసీపీ ఈడీకీ బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. ఎన్టీపీసీ అధికారులు స్పందించకపోతే ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తామన్నారు. తాము కూడా రెడ్ బుక్ మెయింటెన్ చేస్తున్నామన్న కౌషిక్ రెడ్డి అధికారులను బెదిరించడం లేదు, బాధ్యత గుర్తు చేస్తున్నామన్నారు.