calender_icon.png 9 December, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుబంధు రాక.. రైతులకు తిప్పలు

09-12-2025 12:15:53 AM

పంటను విక్రయించిన చేతికిందని డబ్బులు

కుబీర్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): యాసంగి పంటలు వేసుకుంటున్న ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతుబంధు నిధులు జమ కాకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. అక్టోబర్ మోసం నుంచి జిల్లా లో యాసంగి సీజన్ ప్రారంభం కాగా రైతులు ఇప్పటికీ వానాకాలంలో తీసిన పత్తి సోయా మొక్కజొన్న పంట భూములను తిరిగి సదు లు చేసి వేసవి పంటలు వేసుకుంటున్నారు. సాగునీటి బోర్ల కింద చెరువుల కింద రైతులు మొక్కజొన్న వేరుశనగలు వరి జొన్న పంటలు వేసుకుంటారు.

అయితే ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఎకరానికి 6000 చొప్పున ప్రభుత్వం పెట్టుబడి అందించాల్సి ఉంది ప్రస్తుతం డిసెంబర్ ప్రారంభమైన రైతుకు పెట్టుబడి సాయం అందకపోవడంతో యాసంగి పంటలకు పెట్టుబడిలో డబ్బులు లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు వర్షాకాలంలో రైతులు సాగుచేసిన మొక్కజొన్న సోయ పం టలు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించినప్పటికీ ఇప్పటికీ దానికి సంబంధించిన డబ్బులు రైతు ఖాతాలో జమ చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. 

పత్తి పంటలు సాగు చేస్తున్న రైతులు పత్తి సేకరించడానికి కూలీల కొరత కారణంగా ఇబ్బంది పడుతున్నారు. స్థానికంగా కూలీలు లేకపోవడంతో మహారాష్ట్ర కూలీలను రప్పించుకుంటున్నారు. వారికి కేజీ పత్తికి పది రూపా యల చొప్పున నగదు చెల్లించడం రవాణా చార్జీలు కూడా రైతులే భరించవలసి వస్తుంది. ఒకవైపు పంటను అమ్మిన పైసలు రాకపోగా మరోవైపు ప్రభుత్వ పెట్టుబడి సాయం కూడా అందకపోవడంతో రైతులు యాసంగి పంటల పెట్టుబడులకు డబ్బులు లేక నానా అవస్థలు పడుతున్నారు.