calender_icon.png 9 November, 2025 | 11:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ రెడ్డికి మహిళలంటే గౌరవం లేదు

31-07-2024 04:37:52 PM

సీఎం అలా ఎందుకు మాట్లాడారో మాకు అర్ధం కాలే

సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు

హైదరాబాద్: అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల బృందం నిరసన తెలిపింది. సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం అలా ఎందుకు మాట్లాడాలరో తమకు  అర్ధం కాలేదన్నారు. కేటీఆర్ ప్రతి అంశాన్ని కూలంకుషంగా విరించే ప్రయత్నం చేశారన్నారు. కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి మహిళలు అంటే గౌరవం లేదని సబిత విమర్శించారు.  అక్కలను నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుందని వ్యాఖ్యానించారు. అక్కలు ఎప్పుడైనా అందరి క్షేమాన్ని కోరుకుంటారని ఆమె వెల్లడించారు. సీఎం పీఠంపై చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిని చూశానన్నారు. మీ వెనకున్న అక్కలే మిమ్మల్ని ముంచారని సీఎం అన్నారు. మిమ్మల్ని కూడా ముంచుతారని కేటీఆర్ తో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని చెప్పారు. నోటీకి ఏదొస్తే అది సీఎం మాట్లాడుతున్నారు. సోనియా మొదలు సబిత వరకు అందిరై ఇష్టం వచ్చినట్లు సీఎం మాట్లాడుతున్నారని సబిత మండిపడ్డారు.