calender_icon.png 9 November, 2025 | 1:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాసనసభ రేపటికి వాయిదా

31-07-2024 04:35:08 PM

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ద్రవ్యవినిమయ బిల్లుకు బుధవారం శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన, నిరసనల మధ్య ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. సీపీఐ వాయిదా ప్రతిపాదనను సభాపతి తిరస్కరించారు. దీంతో సభాపతి శాసనసభను రేపటికి వాయిదా వేశారు. సభలో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. సభా సంప్రదాయాలు బీఆర్‌ఎస్‌ పాటించడం లేదు డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.