5 May, 2026 | 9:30 PM

కాంగ్రెస్‌లోకి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్

24-06-2024 01:22 AM

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్‌రెడ్డి

జగిత్యాల, జూన్ 23 (విజయక్రాంతి): జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. అదే రోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చేరాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకొన్నారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. జగిత్యాల జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం రేపోమాపో హస్తం గూటికి చేరనున్నట్టు సమాచారం.