22 April, 2026 | 10:29 AM

ఆటో నడుపుతూ అసెంబ్లీకి చేరుకున్న కేటీఆర్, ఎమ్మెల్యేలు

18-12-2024 10:30 AM

హైదరాబాద్: తెలంగాణ శాసనసభలో ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మాన ప్రతిపాదనను ప్రవేశపెట్టనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆటోలో అసెంబ్లీకి వెళ్లారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఎమ్మెల్యేలను ఆటోలో ఎక్కించుకుని స్వయంగా ఆటో నడుపుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసెంబ్లీకి చేరకున్నారు. ఆటో నడుపుతూ ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అసెంబ్లీకి వెళ్లారు. ఆటోలో వచ్చిన వారిలో ప్రశాంత్ రెడ్డి, పద్మాదారుగౌడ్, కృష్ణారావు ఉన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఖాకీ చొక్కాలు ధరించి మండలికి వెళ్లారు.