మంచి నీటి సమస్య లేకుండా చూడాలి
ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశాలు
బడంగ్‌పేట్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి) : జల్‌పల్లిలో మంచి నీటి సమస్య అనేది లేకుండా చూడాలని హెచ్‌ఎండబ్ల్యూఎస్, జిహెచ్‌ఎంసి అధికారులను మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జల్ పల్లిలో నెలకొన్న తీవ్ర మంచి నీటి ఎద్దడిని తెలుసుకున్న సబితా ఇంద్రారెడ్డి మంగళవారం జల్ పల్లిలోని జిహెచ్‌ఎంసి కార్యాలయంలో హెచ్ ఎండబ్ల్యూఎస్ జీహెచ్‌ఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించి, మంచి నీటి సమస్యపై చర్చించి, అధికారులకు పలు సూచ నలు చేశారు.
ఈ సందర్భంగా సబితా ఇం ద్రారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మం చినీటి సమస్య తీవ్రంగా ఉన్నది వాస్తవమన్నారు. దీనికి కారణం ప్రభుత్వ అశ్రద్ధ కార ణమని ప్రజలు అనుకుంటున్నారని అన్నా రు. తుక్కుగూడ, జల్‌పల్లి నీటి లైన్లను విడదీసి సరఫరా మెరుగుపడే విధంగా చూడాల న్నారు.
ఈ కార్యక్రమంలో హెచ్‌ఎండ బ్ల్యూఎస్ జనరల్ మేనేజర్ కిషోర్, కాజా జోహార్ అలీ, డిప్యూటీ జనరల్ మేనేజర్ మహేశ్వరరావు డిజిఎం యాదయ్య, మేనేజర్ నాగుల శ్రీనివాస్, మేనేజర్, జల్‌పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకటరామ్, డిఈ ఐష సుల్తానా తదితరులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
గత వారం రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న బీజేపీ బడంగ్ పేట్ సెక్టార్ వన్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణ రెడ్డి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరామ ర్శించి, ఓదార్చారు. మంగళవారం సబితా ఇంద్రారెడ్డి బడంగ్‌పేట్‌లోని రామకృష్ణరెడ్డి నివాసానికి వెళ్లి రామకృష్ణరెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.






