వేములవాడలో డాక్యుమెంట్ రైటర్ దారుణ హత్య
18-12-2024 09:50 AM
హైదరాబాద్: వేములవాడలో డాక్యుమెంట్ రైటర్ రషీద్ దారుణ హత్యకు గురయ్యారు. తెల్లవారుజామున నూకలమర్రివాసి రషీద్ ను దుండగులు హత్య చేశారు. కరీంనగర్ జిల్లా రంగాధరలో రషీద్ డాక్యుమెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడికి భార్య సిరిన్, ఒక కుమారుడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.






