కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్ ఎంపీటీసీ

26-04-2024 01:23:22 AM

జిన్నారం మండలం కొడకంచి గ్రామాల బీఆర్‌ఎస్ ఎంపీటీసీ బత్తు ల సంతోషిమహేశ్ కాంగ్రెస్‌లో చేరారు. గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కాట శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాట శ్రీనివాస్ గౌడ్ పార్టీ కుండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాట మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనకు ఆకర్షితులై ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరుతున్నారన్నారు. 

పటాన్‌చెరు, ఏప్రిల్ 25