14 April, 2026 | 1:21 PM

Breaking News

సమాజంలో ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి   •   అంబేడ్కర్‌కు నివాళులర్పించిన మధిర మార్కెట్ కమిటీ చైర్మన్   •   తల్లాడ పట్టణంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు   •   సోనాల మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   అంబేద్కర్ అసలు వారసులం మేమే   •   సామాజిక న్యాయం, సమానత్వం కోసమే అంబేద్కర్ ఆరాటం   •   కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   కేంద్ర నిబంధనలు పాటిస్తే... దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తారా?   •   బీఆర్ఎస్ పదేళ్ల విధ్వంసం— వందేళ్ల నష్టానికి దారి తీసింది   •   డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు సీఎం రేవంత్ ఘన నివాళి   •  

బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి

10-10-2025 12:46 AM

దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ, అక్టోబర్ 9 (విజయక్రాంతి) : రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు అని బిఆర్‌ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.

గురువారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన బిఆర్‌ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అభ్యర్ధులను గెలిపించాలి అని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపు నిచ్చారు.ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసం చేశారు అని ఆయన తెలిపారు.

అభయహస్తం మేనిఫెస్టోలో మహాలక్ష్మి పేరిట ఇచ్చిన గ్యారెంటీలోని మొదటి హామీ ప్రతి మహిళకు నెలకు రూ.2500 గురించి ప్రస్తావన లేదు అని ఆయన అన్నారు.చివరి గ్యారెంటీ చేయూతలో చెప్పిన రూ.4000 పింఛన్ గురించి ఒక్క మాట లేదు.ఇగ 420 హామీలకు దిక్కే లేదు అని అన్నారు.పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగింది అని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.