18 August, 2026 | 1:22 PM

Breaking News

భూములను భూమాఫీయాకు కట్టబట్టే కుట్ర   •   ఎస్సీ, బీసీల భూములను ప్రభుత్వం లాక్కుంటోంది   •   ప్రభుత్వం తప్పు చేసి.. ప్రజలకు ఎందుకు శిక్ష?   •   ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •  

వేసవి శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి

28-04-2026 01:39 AM

ఏఎంసి చైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుదీర్

కోదాడ (నడిగూడెం) ఏప్రిల్ 27: వేసవికాలంలో క్రీడలలో ఇచ్చే శిక్షణను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ క్రీడాకారులను కోరారు. సోమవారం మండల కేంద్రంలోని శ్రీ కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా యువజన క్రీడల సమాఖ్య సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి ఉచిత కబడ్డీ క్రీడ శిక్షణ ను సర్పంచ్ దున్నా శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ యువతి యువకులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా క్రీడలపై దృష్టి పెట్టి క్రీడల్లో నైపుణ్యతను చాటాలని తెలిపారు. క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని కోరారు. సర్పంచ్ దున్న శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి పాఠశాలకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీ నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ ఎలగూరి నాగరాజు, నడిగూడెం మండల కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ చనగాని కరుణాకర్, గుండు శ్రీను, కాసాని శివకృష్ణ, షేక్ మీరాజుద్దీన్,షేక్ ఇంతియాజ్ , చింతల రమేష్ యలక వెంకటరెడ్డి పాల్గొన్నారు.