calender_icon.png 11 January, 2026 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజి మంత్రి ఎమ్మెల్యే సిహెచ్ మల్లారెడ్డిని కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు

03-01-2026 08:42:25 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సీహెచ్ మల్లారెడ్డిని మేడ్చల్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులతో మల్లారెడ్డి కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్, నడికొప్పు ఉమా నాగరాజు, ముదిరాజ్ పార్టీ నాయకులు మంత్రి కుమార్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.