6 June, 2026 | 6:33 PM

Breaking News

గ్రామసభలను పకడ్బందీగా నిర్వహించాలి: ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి   •   లింగారెడ్డిగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం   •   ప్రణాళికాబద్ధంగా కార్పొరేషన్‌ను అభివృద్ధి చేసుకుందాం   •   ఫార్మర్ రిజిస్టీ తప్పని సరి   •   వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •  

రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఈటెలకు వినతి పత్రం అందజేత

03-01-2026 08:39 PM

ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు: ఎంవి కృష్ణ

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని మల్కాజిగిరి బీజేపీ పార్లమెంటు సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ కు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ అండ్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంవి కృష్ణ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అనంతరం ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపికి విన్నవిచ్చినట్లు ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర సంక్షేమంతో పాటు అభివృద్ధిలో ఆర్టీసీ ఉద్యోగుల సేవలను గుర్తించి హయ్యర్ పెన్షన్ ల విషయంలో తమకు న్యాయం చేయాలని ఎంవి కృష్ణ ఎంపి ఈటెల రాజేందర్ ను కోరినట్లు చెప్పారు. అదేవిధంగా శాఖ పరమైన ఇతర సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని ఆయన ఎంపికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగేశ్వర్ రావు, సభ్యులు రావి కృష్ణారెడ్డి, విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.