calender_icon.png 11 January, 2026 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరంగల్, హనుమకొండను ఒకే జిల్లాగా కొనసాగించాలి

03-01-2026 08:46:28 PM

తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ఉమ్మడి వరంగల్ ను గత పాలకులు ఆరు ముక్కలుగా విభజించారని అంతేకాకుండా వరంగల్, హనుమకొండ ను పాలన సౌలభ్యం కోసం రెండు వేరు వేరు జిల్లాలుగా చేస్తున్నామని చెప్పారని కానీ అదేమీ జరగలేదని అందువల్ల వరంగల్, హనుమకొండ ను ఒకే జిల్లాగా కొనసాగించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి శ్రీనివాస్ అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... గత పాలకులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాల పాలనలో అన్యాయం జరిగిందని అనేక విధాలుగా ప్రజలను, విద్యార్థులను, ఉద్యోగులను మోసం చేశారని అన్నారు.

హైదరాబాద్ మహానగరం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రెండవ అతిపెద్ద నగరం అని అన్నారు. చారిత్రాత్మక నగరమైన హనుమకొండ, వరంగల్ ను ఒకే జిల్లాగా ఉంటే పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తాయని వాటి వల్ల నిరుద్యోగ, ఉపాధి అవకాశం వస్తాయని, వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుందని, సకల అభివృద్ధికి జరుగుతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం లోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ, వరంగల్ ను ఒకే జిల్లాగా చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు చిల్ల రాజేంద్రప్రసాద్, జావిద్, టీజేఎస్ నాయకులు శ్రీనివాసపతి, ప్రభాకర్, రాధా కిషన్, కుమ్మరి రాజు, ఆలీ, వెలిశాల రాజేష్, శివ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.