calender_icon.png 4 June, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు అన్నెం వెంకట్ రెడ్డి సస్పెండ్

02-06-2025 12:10:34 PM

కోదాడ: కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మీపురం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కోదాడ మండల యూత్ అధ్యక్షుడు(BRS Party Mandal Youth President )  అన్నెం వెంకట్రెడ్డి తండ్రి పాపిరెడ్డి  పార్టీ వ్యతిరేక  కార్యకలాపాలు పాల్పడుతూ పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నందున పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు పార్టీ నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా రామలక్ష్మీ పురం గ్రామంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం కార్యక్రమం సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అన్నెం  వెంకటరెడ్డి, బెల్లంకొండ బ్రహ్మం, కొప్పుల సురేందర్ రెడ్డి, సోమిరెడ్డి, వెంకటరెడ్డి, తుపాకుల రాములు, పాముల రాజశేఖర్, చేజర్ల రమేష్,  శివ, అన్నెం వెంకటరెడ్డి, లక్ష్మయ్య, తదితరులు  పాల్గొన్నారు.