13 April, 2026 | 10:23 PM

ఈ నెల 19న ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ

13-04-2026 09:13 PM

దమ్మపేట,(విజయక్రాంతి): ఈ నెల 19 తేదీ న ఖమ్మం  మమత హాస్పిటల్ గ్రౌండ్ నందు బి ఆర్ ఎస్ పార్టీ మినీ ప్లీనరీ సమావేశం సాయంత్రం 4 గంటలకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా  మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హాజరవుతారని, అదే రోజు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా  మీటింగ్ అనంతరం జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుటకు ఏర్పాట్లు చేయడం జరిగిందని, అశ్వారావుపేట నియోజక వర్గ  బి ఆర్ ఎస్ పార్టీ  కార్యకర్తలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దమ్మపేట  సొసైటీ మాజీ అధ్యక్షులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  రైతుబంధు సమితి  మాజీ అధ్యక్షులు రావు జోగేశ్వర రావు  ఒక ప్రకటనలో తెలిపారు.