అర్రైవ్ అలైవ్, డ్రగ్స్ నివారణపై అవగాహన సదస్సు
13-04-2026 09:15 PM
ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో ఎస్పీ బి రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు సుభాష్ నగర్‌లో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా అర్రైవ్ అలైవ్, డ్రగ్స్ నివారణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యు వెంకన్న బాబు పాల్గొని మాట్లాడుతూ... యువత డ్రగ్స్ మాఫియా కుట్రలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని, మత్తు పదార్థాల సమాచారాన్ని పోలీసులకు అందించాలని తెలిపారు. రోజూ బయటకు వెళ్లే వారు క్షేమంగా ఇంటికి చేరడమే అర్రైవ్ అలైవ్ లక్ష్యమని పేర్కొన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ టి సురేష్, ఎంపీడీవో, సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.




