బీఆర్‌ఎస్ పార్టీ విజయం ఖాయం
హామీలను అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
హాలియా, జూలై 17: అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు. అనుముల మండలం పాలెం, రామడుగు గ్రామాల ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజేందర్ రెడ్డి , ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాలలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకంటే ముందు ఆరు గ్యారంటీలు,420 హామీలను అమలు పరచడంలో విఫలం అయిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు.
సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, ఊర్లుగొండ, వెంకటయ్య, చే గుండి కృష్ణ మజ్జిగ వెంకటరామిరెడ్డి పిల్లకంటి శ్రీనివాస్ గ్రామ శాఖ అధ్యక్షులు కట్నం నాగరాజు గౌడ్,చిన్నబోయిన నాగరాజు జక్కల శ్రీనివాస్ చక్ల రమేష్,మండల యూత్ అధ్యక్షుడు కట్నం నాగరాజు,గౌరు సాయి,వెంకన్న నర్సిరెడ్డి,లక్ష్మయ్య,రామ్ రెడ్డి,వెంకటేశ్వర్లు సైదులు,సైదయ్య రాజుపాల్,నాగరాజు లింగయ్య,మరియు,మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




