calender_icon.png 18 July, 2025 | 12:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టణంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన

18-07-2025 12:00:00 AM

తనిఖీలు, సమీక్షలతో బిజీబిజీ

కోదాడ, జులై 17 : పట్టణంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేయగా గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంపై ఆగ్రహంవ్యక్తం చేశారు. నివేదిక సమర్పించాల్సిందిగా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరధను ఆదేశించారు. 100 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడాన్ని గుర్తించి త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు.

అనంతరం మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్  పాఠశాలను సందర్శించి ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరము ఏం పి సి విద్యార్థులతో  ముఖాముఖి నిర్వహించారు. నూతన మునిసిపల్ కార్యాలయ భవనం నిర్మాణం కోసం తాత్కాలికంగా ఎం ఎన్ ఆర్ స్కూల్ లోకి మార్చడం గురించి భవనాన్ని పరిశీలించి సూచనలు చేశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ అధికారులతో సమీక్షించారు. భూభారతి, రెవిన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు.

అనంతరం గుడిబండ రోడ్డులో ఉన్న చంద్రకళ ఫర్టిలైజర్స్ షాపును తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్  కమీషనర్ రమాదేవి, ఆర్ అoడ్ బీ అధికారులు, తాసిల్దార్ వాజిద్ అలీ, మండల విద్యాధికారి సలీం షరీఫ్, మైనారిటీ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాల  ప్రిన్సిపాల్ మాధురి,  ఉపాధ్యాయురాలు ఆకుల జ్యోతి పాల్గొన్నారు.