18-07-2025 12:00:00 AM
సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.ఈశ్వరరావు
సూర్యాపేట, జూలై 17 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక ప్రజా విధానాలను జూలై 9న జరిగిన దేశవ్యాప్త సమ్మె స్ఫూర్తితో ఎండగట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈశ్వర్ రావు కార్మికులను కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జరిగిన సిఐటియు జిల్లా కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో సమ్మె సందర్భంగా 30 కోట్ల మంది సమ్మెలో పాల్గొన్నాతన్నారు.
పని గంటలు పెంచాలని చూస్తున్న ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోకపోతే ఒక్కరోజు సమ్మె కాదు నిరవధిక సమ్మె చేయటానికి సిద్ధంగా ఉంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రాంబాబు నెమ్మాది వెంకటేశ్వర్లు, కార్యదర్శి వర్గ సభ్యులు చెరుకు ఏకలక్ష్మి, బుర్ర శ్రీనివాస్ యల్క సోమయ్య గౌడ్, శీలం శీను వట్టపు సైదులు, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.