కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసన
02-09-2026 | 08:17pm
ఆలేరు, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఆలేరులో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన వైఫల్యాలపై బీఆర్‌ఎస్ నిరసన చేపట్టింది. ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ 420 అడుగుల ఫ్లెక్సీని ప్రదర్శించారు. కార్యక్రమంలో గొంగిడి మహేందర్‌రెడ్డి, కల్లూరి రామచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






