నాలుగు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
02-09-2026 | 08:24pm
కాగజ్‌నగర్, సెప్టెంబర్ 2(విజయ క్రాంతి): కార్డుదారుల నుంచి కొనుగోలు చేసిన రాయితీ పీడీఎస్(PDS) బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఎన్‌ఫోర్స్‌మెంట్(Enforcement) అధికారులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీటీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు కాగజ్‌నగర్ బస్టాండ్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటోలో తరలిస్తున్న 10 బస్తాల సుమారు 4 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఆటో సీజ్(Auto Seized) చేశారు. ప్రాథమిక విచారణలో నిందితుడిగా ఎండీ. అస్లాం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వ ఉచిత బియ్యాన్ని దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






