5 September, 2026 | 10:50 AM

మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి

02-09-2026 | 08:05pm

మునిప‌ల్లి, సెప్టెంబ‌ర్ 2( విజయ్ క్రాంతి ):  మండ‌ల కేంద్ర‌మైన మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్ ను  బుధ‌వారం జిల్లా గ్రంథాల‌య సంస్థ  చైర్మ‌న్  అంజ‌య్య, ఎస్సీ కార్పొరేష‌న్ ఈడీ, మండ‌ల ప్ర‌త్యేకాధికారి రామాచారి, రాయికోడ్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ సుధాక‌ర్ రెడ్డి ఆక‌స్మికంగా త‌నిఖీ చేసి ప‌రిస‌రాలు, కిచెన్ , స్టోర్ రూమ్ ల‌ను  ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా హాస్ట‌ల్  ప‌రిశుభ్రంగా  బాగుందని హాస్ట‌ల్ వార్డెన్  రామ‌ప్పను అభినందించారు. అనంత‌రం  హాస్ట‌ల్ లోని బియ్యాన్ని ప‌రిశీలించి పురుగులుమాత్రం రావడం లేదు క‌దా.. అంటూ వార్డెన్  రామ‌ప్పను అడిగి తెలుసుకున్నారు.  వారి వెంట అధికారులు, స‌ర్పంచులు ఉన్నారు.

మరిన్ని వార్తలు