2 September, 2026 | 9:08 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

02-09-2026 | 08:30pm

బోథ్. సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): సోనాల మండలం(Sonala Mandal)లోని గొల్లపూర్ గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు అనే వ్యక్తి తన పంట చేనులో గంజాయి సాగు(Cannabis cultivation) చేస్తుండడంతో ఆయన చేనులో ఐదు గంజాయి మొక్కలు ఎస్సై పురుషోత్తం(SI Purushotham) స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రీమాండు కు తరలించడం జరిగిందని సిఐ గురుస్వామి(CI Guruswamy) తెలిపారు. పత్తి పంటలో అంతర పంటగా గంజాయిని పండిస్తున్నట్లు గుర్తించి మొక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న మొక్కలు గంజాయి మొక్కలే అని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ధారించి నట్లు సీఐ తెలిపారు. పట్టుకున్న 50 వేల రూపాయలు విలువ ఉందన్నారు. అంతేగాక గంజాయి సాగు చేయడం అక్రమ రవాణా చేయడం చట్టరీత్యా నేరమని సిఐ హెచ్చరించారు.