30 August, 2026 | 12:42 AM

ప్రభుత్వ పాలనకు బీఆర్‌ఎస్ నిరసనలు

30-08-2026 12:00 AM

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

చేవెళ్ళ ఆగస్టు 29 (విజయక్రాంతి): బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనకు నిరసన గా చేవెళ్ల నియోజకవర్గ కేంద్రంలోని అట్లాస్ ఫంక్షన్ హాల్ లో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి హాజరై నిరసన కార్యక్రమం పై కార్యకర్తలకు 7డేస్ ప్రణాళికపై దిశా నిర్దేశం చేశారు.

నిషేధిత 22ఏ భూములు, వితంతు వృధాప్య పెన్షన్లు జాబ్ క్యాలెండరు ఎస్సి డిక్లరేషన్, ప్ర భుత్వం ఉద్యోగుల జీతాలు, రైతుబందు రైతుభీమా రైతులకు యూరియా బుక్కింగ్ కా ంగ్రెస్ 6 గ్యారంటీలూ 14 డిక్లరేషన్, 420 హామీలు గ్రామాల్లో వంట వార్పు మూడేళ్ల పిల్లలతో కేసీఆర్ కిట్ నిలిపివేతపై నిరసన వైకుంఠదామాల పరిస్థితి, ప్రజావానిలో పిర్యాదు, చివరగా అంబేద్కర్ విగ్రహాలకు వినతి చేసే కార్యక్రమం చేపట్టాలన్నారు. ఇందుకు ఎంపిటీసీలే ఇంచార్జీలుగా ఉండేలా జాబితా తయారు చేయాలి చెప్పారు.