30 August, 2026 | 12:42 AM

గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ ఉషారాణి!

30-08-2026 12:00 AM

సికింద్రాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): గాంధీ ఆస్పత్రికి కొత్త సూపరింటెండెంట్ను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను సీనియర్ పీడియాట్రిషియన్ డాక్టర్ ఉషారాణికి అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత సూపరింటెండెంట్గా పనిచేసిన డాక్టర్ వాణి ఆగస్టు 1న వైద్య విద్యా సంచాలకురాలు (డీఎంఈ)గా పదోన్నతి పొందడం తో గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ పదవి ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో అనుభవజ్ఞురాలైన డాక్టర్ ఉషారాణిని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.