సంక్షేమ పథకాలపై బీఆర్‌ఎస్ నిరసన
‘-కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’ పునరుద్ధరించాలని డిమాండ్
మొయినాబాద్, ఆగస్టు 17 (విజయ క్రాంతి): కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు సోమవా రం మొయినాబాద్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. మండల పార్టీ అధ్యక్షుడు దారెడ్డి వెం కట్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి మాట్లాడుతూ పేద కుటుంబాల్లో ఆడబిడ్డల వివాహాలకు అం డగా నిలిచిన సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభు త్వం అమలు చేయడం లేదని విమర్శించా రు. పథకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు నరోత్తమ్రెడ్డి, రవి యాద వ్, అంజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.






