25 July, 2026 | 1:47 AM

విద్యార్థులకు మద్దతుగా బీఆర్‌ఎస్ ర్యాలీ

25-07-2026 12:00 AM

బూర్గంపాడు, జూలై 24 (విజయక్రాం తి): ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం సారపాక ప్రధాన కూడలిలో నిరసన ర్యాలీ నిర్వహించారు.పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీలో బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నీట్ పరీక్ష పత్రాల లీకేజీ అంశంపై ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం, నిరసనలను అణచివేసే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు.ర్యాలీలో బీఆర్‌ఎస్ మండల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.