స్మార్ట్ కిడ్జ్‌లో బోనాల సంబురం
25-07-2026 12:00 AM
ఖమ్మం జూలై 24(విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తున్న బోనాల సంబురాలు స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో శుక్రవారం హోరెత్తాయి. డప్పు దరువులతో, పోతురాజు వేషధారణలతో, అమ్మవారి వేషధారణలతో బోనాలు తలపై పెట్టుకుని పాఠశాల విద్యార్థులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామోత్సవం ముందు పోతురాజు వేషధారణలతో విద్యార్థులు ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చింతనిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాల సంబురాలు ప్రతీకగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనిప్పు సుకన్య, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు,విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.






