అనురాగ్ విద్యార్థికి పి.హెచ్.డి పట్టా
ఘట్ కేసర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయం మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధనా విద్యార్థి పి. అజయ్ గౌడ్ (సీనియర్ లెక్చరర్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్, రామంతపూర్) కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ యం.డి. సికిందర్ బాబా పర్యవేక్షణలో ఎక్స్పరిమెంటల్ స్టడీ ఆఫ్ హైడ్రోజన్ ఎన్రిచ్డ్ బయోఫ్యూయల్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ సిఐ ఇంజిన్స్ విత్ ఏ.న్.న్ అండ్ యం.సి.డి.యం అప్రోచేస్‘ అనే తన పరిశోధన అంశంపై 18 ఏప్రిల్ 2026న వైవా వోస్ ఎగ్జామినేషన్ నిట్ ప్రొఫెసర్ ఎ. వీరేష్ బాబు మూల్యాంకన పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తి చేశారు.
డీన్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎం. ముత్తారెడ్డి, డీన్ ఆర్ అండ్ డి డాక్టర్ ఎల్. సతీష్ కుమారన్, అసోసియేట్ డీన్ డాక్టర్ కె. శ్రీనివాస చలపతి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ ఎం.డి సికిందర్ బాబా, మెకానికల్ విభాగ అధిపతి డాక్టర్ టి. కృష్ణయ్య ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. తన పీహెచ్డీ పరిశోధన ప్రయాణం మొత్తం కాలంలో విలువైన మార్గదర్శనం, ప్రోత్సాహం, సహకారం అందించిన అనురాగ్ యూనివర్సిటీ యాజమాన్యానికి , యూనివర్సిటీ ఉన్నత అధికారులకు, తన పరిశోధనా మార్గదర్శ కుడు ప్రొఫెసర్ సికిందర్ బాబా, డాక్టర్ శ్రీనివాస చలపతి, డాక్టర్ టి. కృష్ణయ్య ఇత ర మెకానికల్ విభాగ అధ్యాపకులకు హృద యపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.






