28 August, 2026 | 8:11 PM

Breaking News

అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ పండగ : గుండా నిరంజన్   •   సీఎంకు రాఖీ కట్టిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్   •   విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాం   •   ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉద్యమిద్దాం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి   •   డ్రై ఫ్రూట్స్‌తో రాఖీలు తయారు చేసిన చిన్నారి   •   ఏఐవైఎఫ్ మానుకోట జిల్లా నూతన కమిటీ ఎన్నిక   •   మెడినోవా ఆసుపత్రిలో ఎన్ఐసీయు వైద్య సేవలు   •   ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడిని అరికట్టాలి   •   రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పారమిత విద్యార్థులకు పతకాలు   •  

అవినీతిపై బహిరంగ చర్చకు డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ధర్నా

07-07-2026 12:25 AM

నాగర్ కర్నూల్, జూలై 6 (విజయక్రాంతి): మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు బహిరంగ చర్చకు రావాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు సోమవారం అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. గంటలపాటు నిరసన తెలిపిన అనంతరం అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి కలెక్టర్కు వినతిపత్రం అందజేయడానికి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు ఐదుగురు ప్రతినిధులను మాత్రమే అనుమతించడంతో అధికారులను కలిసి ఆందోళన విరమించారు.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అండదండలతోనే మార్కెట్ కమిటీ చైర్మన్ రమణరావు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. దాదాపు మూడు కోట్ల అక్రమాలకు పడినట్లు ఆరోపించారు. ఈ మొత్తం రైతుల నుంచే వసూలు చేశారని విమర్శించారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ వ్యాపితంగా గన్ని బ్యాగుల పంపకాల్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఐదు నుంచి ఆరు కోట్ల వరకు గన్ని బ్యాగుల పైన అక్రమాలు చేశారని, గన్ని బ్యాగుల డబ్బులను మార్కెట్ కమిటీ వాళ్ళే కాజేశారని ఆరోపించారు. ధర్నా కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి చికోండ్ర శ్రీశైలం, నాయకులు ప్రదీఫ్, వేణుగోపాల్, భాస్కర్, చందుభట్ల వెంకటయ్య, చంద్రశేఖర్ రెడ్డి, పాండు, అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.