calender_icon.png 19 January, 2026 | 5:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ దే విజయం

19-01-2026 04:05:22 PM

బిఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం

డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల మున్సిపల్ లో బిఆర్ఎస్ దే విజయమని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ అన్నారు. సోమవారం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డు బోత్తల తండాలో మున్సిపాలిటీ ఎన్నికల సన్నహక సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని, అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ... గెలుపు ఖాయమని మెజారిటీ లక్ష్యంగా కార్యకర్తలు అందరు సమిష్టిగా పనిచేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, మాజీ ఓడిఎమ్ఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న ,గూగులోతు రాంబాబు , తేజావత్ రవీందర్, సుధాకర్ రెడ్డి, గంట్ల శ్రీనివాస్ రెడ్డి ,గంట్ల మహిపాల్ రెడ్డి, గంట్ల ప్రభాకర్ రెడ్డి ,శ్రీరంగం మదనయ్య, శ్రీరంగం శ్రీనివాసరావు, రామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సత్తిరెడ్డి ,ఉప్పల సతీష్, గంగ సిరి మహేష్ ,గంధం భద్రయ్య, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.