19-01-2026 04:00:53 PM
మందమర్రి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం మార్కెట్ ఏరియా మొదటి జోన్‌కు చెందిన సబ్బని విజయలక్ష్మి (53) సోమవారం ఉదయం తన నివాసంలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... విజయలక్ష్మి పది ఏండ్లుగా పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో బయోలజీ ఉపాధ్యాయురాలిగా పని చేశారు. ఏడు నెలల కిందట విజయలక్ష్మికి పక్షవాతానికి సంబంధించిన హైదరాబాద్‌లో బ్రెయిన్ ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ అనంతరం తలెత్తిన ఆరోగ్య సమస్యల కారణంగా ఆమె మానసిక వేదనకు గుయ్యారు.
అనారోగ్యం రీత్యా ఆమె తన ఉపాధ్యాయ వృత్తికి కూడా స్వస్తి పలికారు. ఆరోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన విజయలక్ష్మీ సోమవారం తెల్లవారు జామున బాత్ రూంలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మందమర్రి ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయలక్ష్మీ భర్త సబ్బని శేఖర్ మాజీ సింగరేణి ఉద్యోగి. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.