సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫాంహౌస్ ఉంది: కేటీఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఫాంహౌస్ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తప్పు జరిగితే కూల్చివేతకు దగ్గర ఉండి సహకరిస్తానని కేటీఆర్ సూచించారు. అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తప్పు తాను చేసినా.. కాంగ్రెస్ వాళ్లు చేసిన చర్యలు తీసుకోవావల్సిందేనని కేటీఆర్ వెల్లడించారు. తన పేరుమీద ఎలాంటి ఫాంహౌస్ లేదని కేటీఆర్ వివరించారు. తన మిత్రుడికి ఉన్న ఫాంహౌస్ ను లీజుకు తీసుకుని ఉన్నానని తెలిపారు. ఎఫ్ టీఎల్, బఫర్ లో ఫాంహౌస్ ఉంటే తానే కూల్చివేయిస్తానన్నారు. తప్పు ఉంటే ఫాంహౌస్ ను కూల్చివేస్తే నాకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందేనని కేటీఆర్ సూచించారు. మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్ నేతలు కట్టిన ఫాంహౌస్ లు చూపిస్తానన్నారు. మంత్రి పొంగులేటి ఎఫ్ టీఎల్ లో ఫాంహౌస్ ఉంది, కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, సుఖేందర్ రెడ్డికి ఎఫ్ టీఎల్ లో ఫాంహౌస్ లు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు.






