23 May, 2026 | 8:51 AM

ఏసీబీ అధికారులకే చుక్కలు చూపించిన స్పూర్తి రెడ్డి

21-08-2024 01:47 PM

హైదరాబాద్: కొత్త నల్లా కనెక్షన్ రూ.30 వేలు లంచం తీసుకుంటూ మణికొండలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్‌ఎండబ్ల్యుఎస్ అండ్ ఎస్‌బి) మేనేజర్‌తో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అరెస్టు చేసింది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ అండ్‌ ఎస్‌బీ మేనేజర్‌ స్పూర్తిరెడ్డి, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి నవీన్‌గౌడ్‌లు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మణికొండలో నూతనంగా నిర్మిస్తున్న భవనానికి రెండు కొత్త నీటి కనెక్షన్ల మంజూరుకు లంచం డిమాండ్ చేసినట్లు బొమ్ము ఉపేంద్రనాథ్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరిచారు.

పుప్పాల్ గూడలో స్పూర్తి రెడ్డి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల పలుఅక్రమ ఆస్తులు గుర్తించింది. స్ఫూర్తి రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలున్నాయి. పలు ఫిర్యాదులతో ఏసీబీ గాలం వేసింది. అయితే ఏసీబీ అధికారులకే  స్పూర్తి రెడ్డి చుక్కలు చూపించారు. రెండు గంటల పాటు తను ఉంటున్న ఇల్లు అడ్రస్ చెప్పకుండా తిప్పలు పెట్టారు. తప్పుడు అడ్రస్ లు చెప్పి అధికారులను తప్పు దోవ పట్టించేందుకు ప్రయత్నించారు.